రాజ్కోట్ హైవేలోని హోటల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సింహం.. వీడియో వైరల్ (video)
తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ఇప్పటికే ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా రాజ్‌కోట్ హైవేలోని ఓ ప్రసిద్ధ హోటల్‌లో సింహం సంచరిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హోటల్‌లో సింహం తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. హోటల్‌లో తిరుగుతున్న సింహానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గత కొద్ది రోజుల్లోనే ఈ సింహం రెండుసార్లు నగరంలోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఆహారం కోసం ఈ పులి తరచూ అడవి నుంచి మానవులు నివసించే ప్రాంతాల్లోకి వస్తుందని అటవీ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే పులుల బృందం రాజ్‌కోట్ నగర శివార్లకు చేరుకుంది. ఈ విధంగా, చాలా సార్లు పులులు, సింహాలు అటవీ ప్రాంతాన్ని విడిచిపెట్టి, మానవ జనాభా ఉన్న ప్రాంతాలలో తిరుగుతున్నాయి.
ఈ దృశ్యాలు కూడా కెమెరాలో బంధించబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత రెండు రోజుల క్రితం ఫిబ్రవరి 8 తెల్లవారుజామున, ఉదయం 5 గంటలకు, రాజ్కోట్ హైవేపై హోటల్ సరోవర్ పోర్టికో ప్రవేశ ద్వారం దగ్గర సింహం సంచరించింది. నగరంలోకి ఎంట్రీ ఇచ్చి.. హోటల్‌లోకి ప్రవేశించింది. ఆపై బయటికి వెళ్లిన దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మరుసటి రోజు నగరంలోని సర్దార్‌నగర్‌లో రాత్రి పులి కనిపించిందని స్థానికులు తెలిపారు.