''బేబీ'' ప్రేమికుడు పాట అదిరింది.. ఏఆర్ రెహ్మాన్ ఛాన్స్ ఇస్తారా?

Last Updated: శనివారం, 17 నవంబరు 2018 (16:28 IST)
ఏపీకీ చెందిన ఓ మహిళ నెట్టింట పాడిన పాట వైరల్ అయి కూర్చుంది. ఈ పాటకు సంబంధించిన వీడియోను ఏఆర్ రెహ్మాన్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేయడమే కాకుండా ఆ మహిళను ప్రశంసిస్తూ పోస్టు చేశాడు. కొన్ని రోజుల క్రితం కేరళకు చెందిన రాకేష్ అనే వ్యక్తి ''విశ్వరూపం'' సినిమాలోని ఓ పాటను పాడటం అది కాస్త వైరల్ కావడంతో.. రాకేష్ కమల్‌ను కలవడం జరిగిపోయింది. 
 
తాజాగా ఏఆర్ రెహ్మాన్ తన సోషల్ మీడియా పేజీలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఏపీ, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బేబీ అనే మహిళ 1994లో ప్రభుదేవా నటించి ఏఆర్ రెహ్మాన్ సంగీతంలో విడుదలైన ''ప్రేమికుడు'' సినిమాలోని ఓ పాటను అద్భుతంగా పాడింది. 
 
ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా బేజీని రెహ్మాన్ కొనియాడారు. ఇంకా బేబీకి రెహ్మాన్ ఛాన్సిస్తారా అంటూ నెటిజన్లు అడగారు. బేబీకి రెహ్మాన్ ఛాన్స్ ఇస్తాడో ఏమో కానీ ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు కోటి ఆమెకు ఛాన్సిచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :