1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ivr
Last Modified: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (13:55 IST)

పవన్ 'దేవుడు'కే బండ్ల 'భక్తుడు' భలే హల్వా పెట్టేశారుగా...

బండ్ల గణేష్ అనగానే పవన్ కల్యాణ్ మాట కూడా వినబడుతుంది. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో భక్తి అనీ, ఆయన తనకు దేవుడు అని నిర్మాత బండ్ల గణేష్ చెప్తుంటారు. అలాంటి బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తనకు చిన్నప్పట్నుంచి హస్తం పార్టీ అంటే పిచ్చి అభిమానమన

బండ్ల గణేష్ అనగానే పవన్ కల్యాణ్ మాట కూడా వినబడుతుంది. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో భక్తి అనీ, ఆయన తనకు దేవుడు అని నిర్మాత బండ్ల గణేష్ చెప్తుంటారు. అలాంటి బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తనకు చిన్నప్పట్నుంచి హస్తం పార్టీ అంటే పిచ్చి అభిమానమనీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో చెప్పలేనంత ఇష్టమని అన్నారు బండ్ల. ఇప్పుడు ఎందుకో రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని అపించిందనీ, ఎలాగూ తనకు చిన్నప్పట్నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం కనుక ఆ పార్టీలో చేరిపోయినట్లు వెల్లడించారు.
 
ఆ సమాధానం వినగానే అక్కడే వున్న కొందరు మీడియా ప్రతినిధులు... మరి పవన్ కళ్యాణ్‌ను దేవుడు అంటూ ఎంతో ఇష్టంగా ఆయన గురించి మాట్లాడుతుంటారు కదా... పవన్ తన పార్టీ జనసేనలోకి ఆహ్వానిస్తే ఏం చేస్తారు అని అడిగారు. దానికి బండ్ల మాట్లాడుతూ... తను పూటకో పార్టీ మార్చే రకం కాదనీ, రాజకీయాల్లో వున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే వుంటానని గట్టిగా చెప్పారు. అంతేకాదు... తనకు పార్టీ పదవి యిచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం తను పనిచేస్తానని సెలవిచ్చారు.
 
కాగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై షాద్‌నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి బండ్ల రాజకీయాల్లో ఏం చేస్తారో చూడాలి.