మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (11:55 IST)

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న పెళ్లి కూతురు వాలుజడ.. ఏంటి సంగతి?

Bridal
Bridal
ఇంటర్నెట్‌లో వింత కథలకు కొరత లేదు. క్రేజీ రెసిపీ కాంబినేషన్‌ల నుండి విచిత్రమైన విన్యాసాల వరకు సోషల్ మీడియాలో రకరకాలైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓపెళ్లికూతురుకు సంబంధించిన వాలుజడ వైరల్ అవుతోంది. ఇందులో వింత ఏంటంటే.. ఆ పెళ్లి కూతురు వాలు జడ పువ్వులతో కుట్టుకోకుండా చాక్లెట్లతో కుట్టుకోవడమే.
 
బ్రైడల్ స్టైల్ ట్రెండ్స్ , ఫ్యాషన్ ఐడియాల కోసం వెతుకుతున్న వారికి ఈ వధువు తప్పకుండా ప్రేరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. తాజా వీడియోలో ఒక వధువు చాక్లెట్లు,  మిఠాయిలతో చేసిన తన ప్రత్యేకమైన కేశాలంకరణను ప్రదర్శించింది, దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్ చేయబడి వైరల్‌గా మారింది.
 
ఈ వీడియోను ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ చిత్ర మేకప్ స్టూడియో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసింది. క్లిప్ వైరల్‌గా మారింది, 6.8 మిలియన్లకు పైగా వ్యూస్, 223k లైక్‌లు వచ్చాయి.
 
కేశాలంకరణకు ప్రధానమైన పిన్స్ సహాయంతో చాక్లెట్ ఎక్లెయిర్స్, మిల్కీ బార్, 5-స్టార్, కిట్ క్యాట్‌లను వాడారు. అంతేగాకుండా వధువు మామిడి మిఠాయితో చేసిన చెవిపోగులు, ఫెర్రెరో రోచర్‌తో చేసిన మాంగ్ టికాతో జడ కుట్టుకుంది. మొత్తం పెళ్లి ఆభరణాలు చాక్లెట్ల తయారు చేయబడటం విశేషం.