ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 24 మే 2022 (16:02 IST)

Brothers Day: సోదరునికి హృదయపూర్వక శుభాకాంక్షలు

brothers day
మే 24 బ్రదర్స్ డే. సోదరుల దినోత్సవం. 2005 నుండి మే 24 బ్రదర్స్ డేగా పాటిస్తున్నారు. ఒకే కడుపున పుట్టిన సోదరులు కాకపోయినప్పటికీ ఇతర వ్యక్తులు, అంటే బంధువులు, పిన్ని లేదా బాబాయి బిడ్డలు లేదా స్నేహితులు కూడా అప్పుడప్పుడు మన జీవితాల్లో సోదరుడి శూన్యతను చవిచూస్తుంటారు.


అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో కనీసం ఒక సోదర వ్యక్తిని కలిగి ఉండాలి. వారు హృదయపూర్వక సలహా కోసం లేదా చిటికెలో చేసే సహాయం కోసం ఎదురుచూసే పరిస్థితి వుంటుంది.

 
బ్రదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు చాలామంది. #BrothersDay హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వాస్తవానికి సోదరుడితో చిన్నచిన్న చికాకులు ఉన్నప్పటికీ, ఉత్తమ రహస్య కీపర్‌గా ఉండగలిగేవాడు సోదరుడొక్కడే. సోదరుడిపై మీకున్న ప్రేమను, మీ జీవితంలో అతని ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ రోజును సెలబ్రేట్ చేసుకోండి.