పామును వాటేసుకుని హాయిగా నిద్రపోతున్న అమ్మాయి..
పామును చూడగానే సైన్యం కూడా వణికిపోతుంది. అలాంటిది అరియానా అనే అమ్మాయి ఎలాంటి భయం లేకుండా పాములను హత్తుకుని నిద్రిస్తున్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోల్లో అరియానా అనే అమ్మాయి పాములను కౌగిలించుకుని నిద్రిస్తుంది.
ఆమె శరీరం చుట్టూ పాములు చుట్టుముడుతుండడం మనల్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అయితే పామును కౌగిలించుకుని ఎలాంటి బెంగ లేకుండా నిద్రపోతున్న చిన్నారి మాత్రం నిజంగా ధైర్యవంతురాలేనని నెటిజన్లు అంటున్నారు.
ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఈ వీడియోను 2 లక్షల 23 వేల మంది చూశారు. 62 వేల మంది షేర్ చేశారు. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు