శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్ మొగిరాల
Last Modified: బుధవారం, 3 ఏప్రియల్ 2019 (19:15 IST)

రెండు చేతులు లేవు.. అయితేనేం.. మెరుపు వేగంతో బాలుడు బౌలింగ్(Video)

భారత్‌లోని క్రీడాభిమానులు క్రికెట్‌ను బాగా ఇష్టపడుతుంటారు. మరికొంత మంది దానిని ఒక క్రీడగా కాకుండా సర్వస్వం అదే అని భావిస్తుంటారు. వైకల్యాన్ని సైతం జయించి అందులో నిలిచే వాళ్లు కొందరే ఉంటారు. ఈ కోవలోకి చెందినవాళ్లలో ఈ వీడియోలో ఉన్న బాలుడు ఉదాహరణగా నిలిచాడు. ఓ గల్లీలో కొందరు టీనేజ్‌ పిల్లలు క్రికెట్‌ ఆడుతున్న వీడియో టీమిండియా క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహా కంట పడింది. 
 
రెండు చేతులు లేని ఓ బాలుడు కసిగా బౌలింగ్‌ చేస్తున్న వీడియోనే ఇది. ఇంకేముంది ఆ బాలుడిని ఉద్దేశించి ‘క్రికెట్‌ ఆడకుండా ఇతడిని ఎవరూ ఆపలేరు’ అంటూ వెంటనే దానిని సోషియల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ బాలుడు క్రికెట్‌ ఎలా ఆడుతున్నాడో మీరు కూడా చూసేయండి.