గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (16:47 IST)

చిరుతకే చుక్కలు చూపించిన లేడి.. వీడియో

చిరుతకే లేడిపిల్ల చుక్కలు చూపించింది. ఓ జింకను టార్గెట్ చేసిన చిరుత దానిపైకి వేగంగా దూసుకొచ్చింది. కానీ జింక తెలివిగా తప్పించుకుంది. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు ఒకవైపు పరుగు తీయబోయిన జింక.. ఆ వెంటనే డైరెక్షన్ మార్చుకుని వెనక్కి పరుగెత్తడం ద్వారా చిరుతను బోల్తా కొట్టించింది.
 
వేగంగా దూసుకొచ్చిన చిరుత తనను నియంత్రించుకునేందుకు ఎక్కువ దూరం పరుగెత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత వెనక్కి చూసేసరికి జింక కనిపించకుండా పోవడంతో కంగు తినడం చిరుత వంతైంది.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌లో షేర్‌చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు భారీగా లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.