1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:47 IST)

అస్సాంలో వింత : మనిషి ముఖంతో మేకపిల్ల జననం

ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో ఓ వింత సంఘటన ఒకటి జరిగింది. ఓ మేక కడుపున మనిషి ముఖం ఆకారంతో మేకపిల్ల జన్మించింది. ఈ వింత మేక పిల్లను చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు. రాష్ట్రంలోని ధోలాయ్ విధాన సభ నియోజకవర్గంలోని గంగాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ మేక పిల్లకు అచ్చం మనిషిని పోలిన ముఖం, ముక్కు, నోరు ఉండగా, చెవులు మాత్రం మేకకు ఉన్నట్టుగానే రెండు ఉన్నాయి. అలాగే కాళ్లు కూడా రెండు ఉన్నాయి. ఈ వింత మేక పిల్ల విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో దీన్ని చూసేందుకు స్థానికు ఆ గ్రామానికి క్యూకట్టారు.