బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (17:36 IST)

మ్యాగీ న్యూడిల్స్‌ ప్యాకెట్‌లో రెండు మసాలా ప్యాకెట్లు.. ఎలా..?

Maagi
సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మ్యాగీ న్యూడిల్స్‌‌ ప్రేమికుడి పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాను కొనుక్కున్న మ్యాగీ న్యూడిల్స్‌ ప్యాకెట్‌లో రెండు మసాలా ప్యాకెట్లు రావటంతో శశ్వంత్‌ ద్వివేదీ అనే ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను కొనుక్కున్న మ్యాగీ ప్యాకెట్‌లో​ రెండు మసాలా ప్యాకెట్లు వచ్చాయి. ఒట్టు.. తాను అబద్ధం ఆడటం లేదన్నాడు.  
 
ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేశాడు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అతడి అదృష్టంపై తమ అసూయను వెళ్లగక్కారు. ఈ పోస్టు పెట్టిన వ్యక్తిని చూస్తుంటే కడుపు మండిపోతుందని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు. ''దాన్ని మ్యాజిక్‌ మసాలా అనడానికి ఇదే కారణం.. నీ అదృష్టాన్ని ఉద్ధేశించి ఏమైనా ప్రసంగిస్తావా?.. అదృష్టం అంటే నీదిరా బాబు..." అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.