హైనా చెవులు పట్టుకుని చుక్కలు చూపించిన గాడిద.. వీడియో వైరల్ (Video)
హైనా ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపించే జంతువు. హైనాల్లో మూడు రకాలున్నాయి. హైనా వేట దారుణంగా వుంటుంది. అలాంటి క్రూర మృగమైన హైనాకు ఓ గాడిద చుక్కలు చూపించింది. ఇటీవల క్రూర మృగాలను సైతం లెక్కచేయకుండా తరుముకునే జంతువులకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా హైనా.. గాడిదకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గాడిద హైనాపై దాడి చేసింది. దాని మెడపట్టుకుని ఊపిరి పీల్చుకోనివ్వకుండా చుక్కలు చూపించింది.
చెవుల్ని వదిలితే ఎక్కడ అది దాడి చేస్తుందోనని.. దానిపై పట్టు సాధించింది. చెవులు పట్టుకుని దానిని కొరికింది. గాడిద కొరుకుడికి హైనా విలవిల్లాడిపోయింది. నొప్పి భరించలేక అరిచింది. అయినా గాడిద వదిలిపెట్టలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవడంతో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.