శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (12:55 IST)

దేశంలో తొలిసారి పట్టాలెక్కిన ప్రైవేట్ రైలు

private train
దేశంలో తొలిసారి ప్రైవేట్ రైలు పట్టాలెక్కింది. భారత్ గౌరవ్ పేరుతో ఈ రైలును నడుపుతున్నారు. కోయంబత్తూరు నుంచి షిర్డీకి ఈ నెల 14వ తేదీన బయలుదేరి వెళ్లింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ రైలు కోవై స్టేషన్ నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి బయలుదేరి వెళ్లింది. ఇది తన గమ్యస్థానానికి గురువారం ఉదయం 7.25 గంటలకు చేరుకుంటుంది. దీంతో దేశంలో తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వేకు దక్కింది. 
 
మొత్తం 20 బోగీలు కలిగిన ఈ రైలులో 1500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో ఏసీ కోచ్‌లతో పాటు స్లీపర్ కోచ్‌లు కూడా ఉన్నాయి. ఈ రైలును నిర్వాహకులు రెండేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకున్నారు. నెలలో కనీసం మూడు ట్రిప్పులుగా ఈ రైలును నడిపేలా ప్లాన్ చేశారు. కోయంబత్తూరుకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఈ రైలును నడుపుతోంది.