ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (17:26 IST)

ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసింది ఇంటర్‌ విద్యామండలి.
 
పదో తరగతి మార్కులకు 30శాతం, ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి 70% వెయిటేజీతో మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్‌ పాయింట్లు కేటాయించారు.
 
ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ‌http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in,  https://results.apcfss.in,  వెబ్‌సైట్లలో చూడవచ్చు.