గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: సోమవారం, 7 జనవరి 2019 (21:13 IST)

ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. అందుకే ఆ పార్టీలో చేరుతా... కత్తి మహేష్

సరిగ్గా ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగర బహిష్కరణకు గురై ఆ తరువాత  కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు తిరుగుతున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ చాలా రోజుల తరువాత తిరుపతిలో కనిపించారు. కళాకారుల సమస్యలపై ఆయన మాట్లాడారు. కళాకారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అయితే మీడియా సమావేశంలో మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్.
 
తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం ఖాయమని, ఈ నెల చివరిలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారాయన. తెలుగుదేశం పార్టీలో చేరితే తనను ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేస్తారని, అంతేకాకుండా చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా చెబుతున్నారు. 
 
అందుకే ఆ పార్టీలో కాకుండా వైసిపి లేదా జనసేనలలో మాత్రమే చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ పైన విమర్సలు చేసి ఇబ్బందులు పడ్డ కత్తి మహేష్ జనసేనలో చేరితే ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తారా అన్నది డౌటే. అందుకే ఇక మిగిలింది వైసిపి మాత్రమే కాబట్టి ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏం చేస్తారో చూద్దాం.