ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (13:20 IST)

ఆవును వేటాడని చిరుత.. నెట్టింట వీడియో వైరల్

Tiger
Tiger
చిరుత ఆవును వేటాడకుండా దాన్ని దాటి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అడవిలో పులులు వేటాడటం నైజం. 
 
జింకలు వంటి జంతువులు పులికి ఆహారంగా మారుతాయి. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్రూర మృగమైన చిరుతపులి తన ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించింది. 
 
రోడ్డుపై అడవి నుంచి వచ్చిన చిరుతపులి పక్కనే ఆవు గడ్డి మేస్తోంది. అయితే చిరుత ఆవును వేటాడకుండా దాన్ని దాటి మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. వీడియోలో చిరుతపులి వ్యవహరించిన తీరు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో, vikrantsmaik అనే చిరుతపులి తన ప్రవృత్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. అడవిలోంచి బయటకు వచ్చిన చిరుతపులి రోడ్డుపై నిల్చున్నట్లు గల వీడియో వైరల్ అవుతోంది. అటుగా వెళ్తున్న కొందరు చిరుతను తమ కెమెరాల్లో బంధించారు.