శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (17:53 IST)

ముక్కులో పైపు.. చేతిలో బడ్జెట్ ప్రతులు... జోష్ - హోష్ తగ్గలేదట...

దేశంలో సచ్ఛీలుగా ఉన్న అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో మనోహర్ పారికర్ ఒకరు. ఈయన ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో దేశ రక్షణ శాఖామంత్రిగా పని చేసి, పలు కీలక సంస్కరణలు చేపట్టారు. ఆ తర్వాత పార్టీ అవసరాల దృష్ట్యా ఆయన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి గోవా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 
 
అయితే, ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల అమెరికాకు వెళ్లి చికిత్స కూడా చేయించుకుని వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటపడక పోయినప్పటికీ.. విధులకు మాత్రం హాజరవుతూనే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం గోవా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ముక్కులో పైపు పెట్టుకుని మరీ బడ్జెట్ ప్రసంగం చదవడం దేశవ్యాప్తంగా చర్చాంశమైంది. గోవా రాజకీయాల్లోనూ పారికర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఆయన సభలో కనిపించిన తీరుపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. నెటిజన్లు మాత్రం మనోహర్ పారికర్ నిబద్ధతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఇక విపక్షాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్నా ప్రవేశపెట్టిన తీరుపైనే వాదోపవాదాలు జరుగుతున్నాయి. బడ్జెట్ ప్రసంగం సమయంలో పారికర్ మాట్లాడుతూ, తనలో ఇంకా జోష్ (ఉత్సాహం), హోష్ (స్పృహ) ఉన్నాయని పదేపదే అన్నారు. వీటిని పట్టుకున్న విపక్ష నేతలు.. ఆయనలో హోష్, జోష్ కన్నా అధికార యావ ఎక్కువగా కనిపించాయని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆర్థిక, హోం, ప్రణాళిక వంటి కీలకమైన శాఖలను పారికర్ ఇతర మంత్రులకు ఇస్తే బాగుంటుందని గోవా కాంగ్రెస్ అధికార ప్రతనిధి రమాకాంత్ ఖలాప్ అన్నారు.