శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2019 (13:32 IST)

మీ PAN కార్డ్ Aadhaar కార్డుతో లింక్ అయ్యిందా లేదా? మార్చి 31 ఆఖరు...

ఈ విషయంపై ఇప్పటికే మీడియాలో చాలానే కథనాలు వచ్చాయి. ఈ నెల మార్చి 31వ తేదీ లోపుగా పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను ఎవరైతే చేయరో వారి పాన్ కార్డు ఆ తర్వాత పని చేయదు. అంతేకాదు.. ఐటీ రిటర్స్న్ ఫైల్ చేయడం కూడా సాధ్యంకాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరో రెండు రోజుల సమయం వున్నది కనుక వెంటనే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. 
 
అసలు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం ఎలాగో చాలామందికి కన్ఫ్యూజన్ వుంటుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in లింకును ఓపెన్ చేయాలి. అందులో ఎడమవైపు బార్‌లో క్విక్ లింక్స్‌లో కనిపించే ‘Link Aadhaar’ ట్యాబ్‌ పైన క్లిక్ చేయగానే కొత్త పేజీ వస్తుంది. అందులో మీ పాన్, ఆధార్ నెంబర్, ఆధార్‌పై ఉన్న పేరు, కప్చా కోడ్ లేదా ఓటీపీ నెంబరు ఎంటర్ చేసి పాన్-ఆధార్ లింక్ చేసేయవచ్చు. కనుక వెంటనే ఆ పని చేయండి. 
 
ఐతే కొందరు తమ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశామని గుర్తుంటుంది కానీ అది లింక్ అయ్యిందో లేదో అనే కన్ఫ్యూజన్ వుంటుంది. అలాంటివారు ఇక్కడ క్లిక్ చేసి పాన్-ఆధార్ నెంబర్లను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.