మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (13:28 IST)

పదవుల కోసం పొత్తు పెట్టుకోలేదు : మెహబూబా ముఫ్తీ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పదవుల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదని మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. అదేసమయంలో కండబలంతో కూడిన భద్రతా విధానం జమ్మూకశ్మీరులో పనిచ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పదవుల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదని మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. అదేసమయంలో కండబలంతో కూడిన భద్రతా విధానం జమ్మూకశ్మీరులో పనిచేయదని, సర్దుబాటే ప్రధానమని ఆమె అభిప్రాయపడ్డారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కొనసాగుతూ వచ్చిన పీడీపీ సంకీర్ణ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆమె సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు.
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, 'కాశ్మీరు శత్రు స్థావరం కాదు. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడినందున, దాని ద్వారానైనా కాశ్మీరుకు న్యాయం దక్కుతుందని భావించాం. అందుకే బీజేపీతో పీడీపీ పొత్తు పెట్టుకుంది. అంతేకానీ, అధికారం కోసమో పదవుల కోసమో కాదని తేల్చి చెప్పారు.
 
అలాగే, '370వ అధికరణ కొనసాగింపు, ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలు, యువకులపై కేసుల ఎత్తివేత, పాకిస్థాన్‌ సహా అన్ని వర్గాలతో చర్చలు జరపడం అనే అంశాల ప్రాతిపదికన బీజేపీతో కలిశాం. ఈ మూడేళ్లలో 370 అధికరణకు సంబంధించి వివాదాలు రాలేదు. రాళ్ల దాడులు జరిపిన 12 వేల మంది యువకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయించాం. పౌరసత్వం, విద్య, ఉద్యోగాలు, హక్కులకు సంబంధించి కాశ్మీర్‌ అసెంబ్లీకున్న విశేషాధికారాల అధికరణం 35ఏను పరిరక్షించగలిగినట్టు చెప్పుకొచ్చారు.