1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జులై 2023 (22:02 IST)

కోతి దొంగగా మారి చెట్టు ఎక్కింది.. లక్ష రూపాయల్ని?

monkey
కోతి దొంగగా మారి చెట్టు ఎక్కింది. లక్ష రూపాయలు ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన కోతి చెట్టుపై కూర్చుంది. దిగిరమ్మంటే ఎంతకీ రాలేదు. ఎంత వేడుకున్నా వానరం చెట్టు నుంచి కిందకు రాలేదు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు, హుస్సేన్.. కోతి నుంచి బ్యాగ్‌ను తిరిగి తీసుకోవడానికి నానా తిప్పలు పడ్డారు. 
 
ఎంత ప్రయత్నించినా కోతి బ్యాగ్ ఇవ్వలేదు. దీంతో స్థానికులు కోతిని వెంబడించారు. ఎట్టకేలకు బ్యాగును అక్కడే వదిలేసి కోతి వెళ్లిపోయింది. దీంతో ఆ లక్ష రూపాయలెత్తుకున్న యజమాని హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో నివసించే షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో ఉన్న షహాబాద్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. 
 
టూ-వీలర్‌లో వెళ్లిన షరాఫత్ తన దగ్గర లక్ష రూపాయల నగదున్న బ్యాగును ద్విచక్రవాహనంపై ఉంచి అక్కడికి దగ్గరలో ఉన్న బల్లపై కూర్చున్నాడు. 
 
అంతే ఎక్కడనుంచో వచ్చిన కోతి ఆ డబ్బును ఎత్తుకుని చెట్టు ఎక్కింది. అంతే ఆ కోతి నుంచి నానా తంటాలు పడి ఆ లక్షను స్థానికులు పట్టుకొచ్చారు.