1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (17:38 IST)

మంకీపాక్స్ ఎమెర్జెన్సీ ఎత్తివేత.. ఇక అక్కర్లేదు.. డబ్ల్యూహెచ్ఓ

monkey fox
మంకీపాక్స్.. కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని అంతగా భయపెట్టిన వ్యాధి. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వేలాది మందికి వ్యాపించింది. అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమెర్జెన్సీ ప్రకటించింది. అయితే తాజాగా ఎమెర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 
 
ఇకపై మంకీపాక్స్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ తెలిపారు. ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వందకు పైగా దేశాల్లో 70వేల కంటే ఎక్కువ మంకీ పాక్స్ కేసులు నమోదైనాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాధి అధికంగా వ్యాపించింది. 
 
గత ఏడాది మే నెలలో బ్రిటన్‌లో మొదటిసారి మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఏడాది మేలో మంకీపాక్స్ ఎమెర్జీన్సీని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎత్తివేసింది.