శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (18:59 IST)

కొట్టేసిన కొమ్మకు కూడా గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు..

వృక్షాలను ప్రస్తుతం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. చెట్లను నాటడంపై మానవుడు ఆలోచించడమూ లేదు. అయితే ప్రాణ వాయువుని ఇచ్చి.. పండ్లను ఇచ్చీ.. నీడను ఇచ్చి కాపాడుతున్నాయి వృక్షాలు. ఇదిగో ఈ చెట్టును చూస్తే అది ఎంత నిజమో కదా అనిపిస్తుంది. కొట్టేసిన కొమ్మకు కూడా మామిడి కాయలు గుత్తులు గుత్తులుగా విరగకాశాయి. కత్తివేటుకు ఒరిగిన కొమ్మే పట్టుగొమ్మై ఫలించింది. కొట్టేసిన మొద్దుకే మామిడికాయలు గుత్తులు గుత్తులుగా విరగకాసింది.
 
ఏపీలోని కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఓ టీచర్ వ్యవసాయ క్షేత్రంలోని ఓ మామిడి కొమ్మకు అదికూడా కొట్టేసిన కొమ్మ కాయల్ని విరగకాసింది. 40 ఏళ్ల క్రితం నాటిన దేశవాళీ మామిడి చెట్ల కొమ్మలను కొంతకాలం క్రితం నరికించారు. ప్రస్తుతం ఆ నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగకాసి అందరినీ అబ్బురపరుస్తున్నాయి.