శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 15 మే 2021 (16:50 IST)

రఘురామక్రిష్ణ రాజుకి నో బెయిల్, జైలు ఖాయమా? ఇక బయటకు రారా?

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వైసిపి ఎంపి రఘురామక్రిష్ణమరాజు చేసిన విమర్సలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. సొంత పార్టీ ఎంపిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీ అధినేతను, వైసిపి ప్రభుత్వాన్ని విమర్సించడంపై తీవ్రస్థాయిలో ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
 
అసలు రఘురామక్రిష్ణమరాజు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనను ఎవరు విమర్సించినా వెంటనే రఘురామక్రిష్ణమరాజు వారికి కౌంటర్ ఇస్తూ వచ్చారు. వ్యక్తిగత దూషణలకు దిగుతూ వైసిపి ఎంపి చేసిన విమర్సలు అధికార పార్టీ నేతలకు బాగానే కోపం తెప్పించింది.
 
అయితే తాజాగా ఆయన్ను సిఐడీ పోలీసులు అరెస్టు చేయడం.. గుంటూరుకు తరలించడం లాంటివి జరిగిపోయాయి. హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నా ఆ పిటిషన్‌ను కొట్టేశారు. సిఐడీ కోర్టులోనే మాట్లాడుకోవాలంటూ హైకోర్టు తేల్చేసింది. ప్రభుత్వంపై లేని పోని విమర్సలు చేయడంపై నిన్న రాత్రి వరకు సిఐడీ కార్యాలయంలో రఘురామక్రిష్ణమరాజును విచారించారు. 
 
అయితే ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడంతో ఇక బెయిల్ వచ్చే అవకాశమే లేదంటున్నారు. హైకోర్టే పిటిషన్‌ను తిరస్కరించడంతో ఇక సిఐడీ అధికారుల చేతిలోనే ఎంపి ఉండటంతో సిఐడీ కోర్టులో బెయిల్ అస్సలు రాదన్న అభిప్రాయం రఘురామక్రిష్ణమరాజు సన్నిహితుల నుంచి వ్యక్తమవుతోంది.
 
వైసిపి ఎంపి చుట్టూ ఉచ్చు బిగుస్తోందనీ, ఆధారాలన్నీ నిరూపించి జైలుకు పంపిస్తారనీ, ముందుగా రిమాండ్ విధించారని.. ఆ తరువాత నిజాలను ఆయన దగ్గరే రాబట్టేందుకు సిఐడీ పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోను రఘురామక్రిష్ణమరాజు వ్యవహారం పెద్ద చర్చకే దారితీస్తోంది.