1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (19:17 IST)

బ్యాలెట్ కాదు ఈవీఎంలే ముద్దు : ఎన్నికల సంఘం

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సాగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని తేల్చిచెప్పింది. ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నావాటిని నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. 
 
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను మాత్రమే ఉపయోగిస్తామని, బ్యాలెట్ విధానాన్ని ఉపయోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. బ్యాలెట్ విధానం వల్ల ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాల వెల్లడిలో తీవ్రజాప్యం చోటుచేసుకుంటుందని తెలిపారు. 
 
ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నట్టుగా ఇపుడు బ్యాలెట్ విధానానికి వెళ్లడం కుదరదని చెప్పారు. కాగా, మన దేశంలో ఉపయోగించే ఈవీఎంలను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయని తెలిపారు.