శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (20:03 IST)

ఎన్నికల నాటకానికి వేషాలు మార్చే విదూషకుడు ఎవరు? ప్రకాశ్ రాజ్

prakash raj
భారత్ పేరు మార్చాలన్న డిమాండ్ గత కొద్ది రోజులుగా దేశంలో కలకలం రేపుతోంది. ఇండియా పేరు స్థానంలో "భారత్" అనే పేరు పెట్టాలని అధికార బీజేపీ భావిస్తోంది. 
 
ఈ విషయంలో జాతీయ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అభిప్రాయ విభేదాలు తలెత్తాయి. అలాగే సెలబ్రిటీలు, క్రీడాకారులు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ దేశం పేరు మార్చడంపై వ్యాఖ్యానించారు. 
 
ఈ అంశంపై వ్యాఖ్యానిస్తూ, "పోల్ ఇండియా - ఎన్నికల నాటకం కోసం దేశం పేరును మార్చాలనుకుంటున్నారు. ఎన్నికల నాటకానికి వేషాలు మార్చే విదూషకుడు ఎవరు? అంటూ" అని తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. 
 
దేశం పేరు మార్చే అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.