గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (13:26 IST)

డయానా ధరించిన గౌను.. రూ.4.9 కోట్లకు వేలం పాట

Diana's Gown
Diana's Gown
దివంగత ఇంగ్లండ్ యువరాణి డయానా ధరించిన గౌను అనేక కోట్లకు వేలం వేయబడింది. డయానా ధరించిన గౌను రూ.4.9 కోట్లకు పలికింది. 
 
ఇంగ్లండ్ యువరాణి డయానా ధరించిన దుస్తులను అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఓ ప్రముఖ వేలం సంస్థ ఇటీవల వేలం వేసింది.
 
ఈ పరిస్థితిలో, ఆమె ధరించిన గౌను 80 వేల నుండి 100,000 డాలర్ల వరకు అమ్ముడవుతుందని అంచనా వేయబడింది. అయితే ఐదు రెట్లు ఎక్కువ ధరకు వేలం వేయబడింది.
 
ఈ గౌను భారత కరెన్సీలో రూ.4.9 కోట్లకు వేలం వేయబడినట్లు సమాచారం. ఆమె తన జీవితంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఈ గౌను ధరించిందని చెప్తున్నారు.