1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (19:17 IST)

కర్ణాటకలో ధన ప్రవాహం.. రూ.204 కోట్లు స్వాధీనం..

కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు డబ్బును వెదజల్లుతున్నాయి. భారీగా మద్యం కూడా సరఫరా చేస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో నగదు పంపిణీ ఎక్కువగా వుంది. 
 
సోదాల్లో కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మార్చి 29 నుంచి అమలులోకి వచ్చినప్పటి నుంచి కర్ణాటకలో పది లక్షల లీటర్లకు పైగా మద్యంతో పాటు రూ.200 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జప్తు చేశాయని ఎన్నికల సంఘం తెలిపింది. 
 
స్వాధీనం చేసుకున్న నగదు విలువ రూ.204 కోట్లు. మద్యం రూ.43 కోట్లు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.