మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (22:30 IST)

చెవి రంధ్రంలోకి పాము.. నెట్టింట వీడియో వైరల్

Snake in ear
Snake in ear
చెవుల్లోకి చీమలు వెళ్తేనే ఆ బాధను తట్టుకోలేం. అయితే ఏకంగా పాము వెళ్తే.. అమ్మో ఇంకేమైనా వుందా అనుకుంటున్నారు కదూ.. అవును అలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతి చెవిలో పాము వెళ్లడంతో ఆ యువతి నానా తంటాలు పడింది. చెవి రంధ్రం ద్వారా లోపలికి వెళ్లి ఆ పాము ఆ యువతికి చుక్కలు చూపించింది. 
 
ఒక అమ్మాయి చెవిలో ఉన్న పాము నోటిని తెరచి ఉండడం కనిపిస్తుంది. వీడియోలో నొప్పితో బాధపడుతున్న ఈ అమ్మాయి గొంతు వింటే భయంతో ఉలిక్కిపడిపోవడం ఖాయం. ఓ యువతి మహిళ చెవి రంధ్రంలో పాము ఇరుక్కుపోయింది. ఆ వీడియోలో ఒక వైద్యుడు మెడికల్ టాంగ్స్ సహాయంతో పామును చెవి రంధ్రం నుండి బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు వుంది. 
 
పాము తల చెవి రంధ్రం నుండి బయటకు పొడుచుకు వచ్చింది. పాము శరీరం చెవిలో ఇరుక్కుపోయింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.