సూర్యగ్రహణం జూన్ 21 ఉదయం ఏర్పడనుంది. ఈ గ్రహణం తెలంగాణ రాష్ట్రంలో ఉదయం గం. 10.14 నిమిషాలకు ప్రారంభమవుతుంది. గ్రహణ మధ్యకాలం ఉ. 11.55, గ్రహణ అంత్యకాలం మ. 1.44 నిమిషాలు. గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు.
ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే, గ్రహణ ఆరంభ కాలం ఉదయం గం. 10.23 నిమిషాలు. గ్రహణ మధ్యకాలం మధ్యాహ్నం గం. 12.05 నిమిషాలు. గ్రహణ అంత్యకాలం మధ్యాహ్నం గం1. 51 నిమిషాలు. గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు.
ఈ గ్రహణ సమయంలో మేష, మకర, కన్య, సింహ రాశుల వారికి శుభఫలం. వృషభ, కుంభ, ధనుస్సు, తుల రాశుల వారికి మధ్యమ ఫలం. మిథున, మీన, వృశ్చిక, కర్కాటక రాశుల వారికి
అధమ ఫలం. మిథున రాశివారు గ్రహణ శాంతి చేయించుకోవాలి.
ద్వాదశ రాశుల వారు ఏం చేయాలి?
మిధున, కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను చేయించుకోవాలి.
ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర, బెల్లం గోధుమలు కలిపి ఆవునకు తినిపించాలి.
గోమాత మనం పెట్టిన ధాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.
నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయ లేదా కొబ్బరికాయలను గుమ్మంపై నుండి తీసివేయాలి.
మళ్లీ కొత్త వాటిని పండితులచే పూజించి ఇంటికి, వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.
గ్రహణం తర్వాత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి, కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.
కాబట్టి తిరిగి మనకు, మన కుంటుబ సభ్యుల కోసం ఇంటికి, వ్యాపార సంస్థల రక్షణ కోసం తప్పక కట్టుకోవాలి.