శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (10:06 IST)

పవన్ జల్లాడ్.. ఉరి స్పెషలిస్టు.. ఒక్కసారి కమిట్ అయితే...

పవన్ జల్లాడ్... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా వాసి. వృత్తి జైల్లో ముద్దాయిలను ఉరితీయడం. ఈయన తండ్రి కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. జల్లాడ్ ఫ్యామిలీ సభ్యులు గత మూడు తరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. తాజాగా నిర్భయ కేసులోని నలుగురు దోషులకు పవన్ జల్లాడ్ ఒకేసారి ఉరితీశాడు. ఇలా ఒక కేసులోని నలుగురు ముద్దాయిలను ఒకేసారి ఉరితీయడం దేశ న్యాయవ్యవస్థలో తొలిసారి. 
 
మీరట్ జైలులో ఉరితీసే పవన్ జల్లాడ్.. నిర్భయ దోషులను ఉరితీసేందుకు ఢిల్లీ తీహార్ జైలుకు రప్పించారు. ఉరి తీయ‌డం అత‌నే స్పెష‌లిస్టు. ఇత‌న్ని అంద‌రూ ప‌వ‌న్ అని పిలుస్తారు. తండ్రితో పాటు త‌మ పూర్వీకుల నుంచి ఉరి తీసే ప‌ద్ధ‌తుల్ని ప‌వ‌న్ నేర్చుకున్నాడు. 
 
జైలు అధికారులకు కూడా ప‌వ‌న్‌పై అపార న‌మ్మ‌కం. అత‌ను ఉరి తీస్తే... అందులో ఎటువంటి పొర‌పాటు ఉండ‌దని. ప‌వ‌న్‌కు భార్య‌, పిల్ల‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం అత‌ని ఆర్థిక జీవ‌తం క‌ష్టాల్లో ఉంది. ప‌వ‌న్ చిన్న కుమారుడు కూడా ఇదే వృత్తిని ఎంచుకున్నాడు. 
 
2012లో ఢిల్లీలో జ‌రిగిన నిర్భ‌య గ్యాంగ్ రేప్ కేసులో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీశారు. ఆ న‌లుగురికి ఉరి వేసింది ప‌వ‌న్ జ‌ల్లాడ్‌. ఒక్క దోషిని ఉరితీసినందుకు పవన్‌కు రూ.15 నుంచి రూ.20 వేల వరకు చెల్లించే అవకాశం ఉందని తీహార్ జైలు అదికారులు తెలిపారు.
 
వాస్తవానికి దేశంలోని ఓ ఒక్క జైలులో తలారీ లేడు. దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఉరితీయాలంటే పవన్‌నే ఆధారం. అయితే, ఈ తలారీకి నెలవారి వేతనం ఉండదు. కేవలం నెలకు రూ.3000 భృతిని మాత్రమే చెల్లిస్తారు. అదికూడా ఒక్కసారి ఇవ్వరని పవన్ జల్లాడ్ వాపోయాడు. 
 
గతంలో ఓ జైలులో డబ్బులు తక్కువ ఇస్తున్నారని మరో జైలులో తలారీగా చేరి 2015లో పవన్‌ వార్తల్లో నిలిచాడు. ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత తలారీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్‌ మానసిక పరిస్థితి పరీక్షించిన తర్వాత అతడికి ధృవపత్రం అందజేశారు. నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేశారు కాబట్టే... ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి అంశాలు పరిశీలించిన పిమ్మట ఆయన్ను ఎస్కార్టతో ఇంటికి పంపించారు.