శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (17:02 IST)

అయోధ్యపై మరుతీర్పు లేదు.. ఆ తీర్పే ఫైనల్ : సుప్రీంకోర్టు

అయోధ్యపై మరు తీర్పు లేనేలేదని, నవంబరు 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నవంబరు 9న రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ కోరుతూ మొత్తం 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ విచారణకు స్వీకరించకుండా తోసిపుచ్చింది. 
 
పైగా, అయోధ్య కేసులో నవంబరు 9వ తేదీన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చిచెప్పింది. ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆనాటి తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే తేల్చి చెప్పారు. 
 
కాగా, నవంబరు 9వ తేదీన అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం దశాబ్దాల అయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పుపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ముస్లిం బాడీలు మాత్రం తీర్పుపై రివ్యూ కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.