శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (10:44 IST)

నా బిడ్డ పేగులు బయటకు లాగినపుడు గుర్తుకురాలేదా : నిర్భయ తల్లి

నిర్భయ అత్యాచార కేసులోని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వేదాలు, పురాణాలు వల్లించారు. ఢిల్లీ గాలి పీల్చి సగం చచ్చిపోయాననీ, ఇక ఉరిశిక్ష ఎందుకు అంటూ ప్రశ్నిస్తూనే, తన మానవ హక్కుల గురించిన ప్రస్తావన తెచ్చారు. దీనిపై నిర్భయ తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కుమార్తె పేగుల్ని బయటకు లాగినపుడు వారికి మానవహక్కుల సంగతి గుర్తుకురాలేదా అంటూ ప్రశ్నించారు.
 
2012 డిసెంబరులో ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ సింగ్‌.. క్షమాభిక్ష కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అందులో అతడు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తుల్లో అంశాల గురించి ప్రస్తావించడంపై నిర్భయ తల్లి మండిపడ్డారు. 
 
'నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారకులైనవారికి పూర్తిస్వేచ్ఛ ఉంటుంది.. మాకేమో మానవహక్కులంటూ తర్కం చెబుతారా? బాధితులకు మాత్రమే ఎందుకు అన్ని నిబంధనలూ చూపుతారు? వాళ్లని డిసెంబరు 16నే ఉరి తీయాలి' అంటూ డిమాండ్ చేశారు.