మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2019 (16:01 IST)

క్షమాభిక్ష కోరలేదు.. ఆ సంతకం నాది కాదు.. : నిర్భయ కేసు దోషి

ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులోని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష కోరినట్టు, దాన్ని తోసిపుచ్చాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ మేరకు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ కేసులో ఇపుడు ఓ ట్విస్ట్ జరిగింది. అసలు తాను క్షమాభిక్ష కోరలేని, పైగా, అందులో ఉన్నది తన సంతకం కాదని ప్రకటించాడు. 
 
అసలు తాను పిటిషన్‌పై సంతకమే చేయలేదని.. ప్రస్తుతం ఉన్నదానిని వెంటనే ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని వినయ్ శర్మ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాడు. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌లో తన సంతకం లేదనీ.. అది తాను పెట్టుకున్న అర్జీ కాదన్నాడు. దీంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరిశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.