శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 14 జూన్ 2020 (19:09 IST)

ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ హీరో చనిపోయాడంటే నమ్మని లోకం

సుశాంత్ సింగ్
ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీలో పాపులర్ క్రికెటర్ ధోనీ పాత్రలో నటించి శభాష్ అనిపించుకున్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నిజమని ఆయన అభిమానలోకం జీర్ణించుకోలేకపోతోంది. ఎంతో భవిష్యత్తు వున్న ఈ యువ నటుడు ఇలా అర్థాంతరంగా బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేస్తోంది. 
 
సుశాంత్ జీవితంలో ఎంతో కష్టపడి నటుడుగా ఎదిగాడు. బీహార్‌లోని పాట్నాలో 1986 జనవరి 21న జన్మించిన సుశాంత్ సినిమాల్లోకి రాకముందు ఎన్నో టీవీ సీరియళ్లలో నటించి రాణించాడు. జీటీవీలో 2009-11లో ప్రసారమైన పవిత్ర రిష్తా సీరియల్‌తో తిరుగులేని నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సీరియల్లో అతడి నటన చూసి 2013లో కైపోచేతో చిత్రంలో అవకాశం ఇచ్చారు. అలా సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
అందులో సుశాంత్ నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. అంతేకాదు అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ పీకేలోనూ సుశాంత్‌ కీలక పాత్రలో నటించాడు. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ జీవితకథతో వచ్చిన ''ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'' సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఇప్పటికీ ధోనీ చిత్రం వస్తే అంతా టీవీకి అతుక్కుపోతారు. ఇలాంటి హీరో ఆత్మహత్యకు పాల్పడటం కలచివేస్తోంది.