సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (15:35 IST)

'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్' చిత్ర హీరో ఆత్మహత్య

చిత్ర పరిశ్రమకు చెందిన యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త విన్న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్' చిత్రం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కావడం గమనార్హం. ఈ హీరో ముంబైలోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన వయసు 34 యేళ్లు. 
 
'కై పో చే' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం 'చిచ్చోర్'. ఈ పరిస్థితుల్లో కరోనా లాక్డౌన్ కారణంగా బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అయితే, గత కొన్ని రోజులుగా అతని పరిస్థితి ఏమీ బాగాలేదని, ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.