1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (11:42 IST)

ఆన్‌లైన్‌లో క్లాసులు వినాలంటే.. ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిందే..

online classes
ఆన్‌లైన్‌లో క్లాసులు వినాలంటే నెట్ స్పీడ్‌గా ఉండాలి. అప్పుడే అధ్యాపకులు చెప్పే పాఠం సరిగా వినిపించడంతోపాటు కనిపిస్తుంది. దీంతో సిగ్నల్ కోసం వారంతా ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. అక్కడే లెస్సన్స్‌ విని సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. ఇలా కేరళలోని రాజమాలకు చెందిన విద్యార్థులు పాఠం వినడానికి ప్రతిరోజు పాట్లుపడుతున్నారు.
 
కేరళలలోని ఇడుక్కి జిల్లాలో రాజమాల అనే గ్రామం ఉంది. ఆ ఊరికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. అయితే ఊర్లో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా రాదు. దీంతో ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరవికుళం నేషనల్ పార్కురు ప్రతి రోజు వెళ్తున్నారు. అక్కడి ఎత్తయిన ప్రదేశాల్లో సిగ్నల్ పుల్‌గా ఉంటుండంతో అక్కడే ఆన్‌లైన్ క్లాసులు విని వస్తున్నారు. తాము ప్రతిరోజు ఉదయం నేషనల్ పార్కుకు ఆటోలో వస్తున్నామని, తిరిగి సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నామని ఓ విద్యార్థి చెప్పాడు.
 
రాజమాలలో ఇంటర్నెట్ వసతి లేదు. కొన్ని ప్రదేశాల్లో వచ్చినా.. అది చాలా తక్కువ స్పీడ్‌తో వస్తున్నది. దీంతో ఇంటర్నెట్ కోసం ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లడం తమకు చాలా కష్టంగా ఉంది. కొన్నిసార్లు వానలు పడుతున్నాయి. దీనివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అరున్ అనే విద్యార్థి చెప్పాడు.