శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (22:44 IST)

కాశీ కాదు.. మురికినీటితో చుట్టబడిన నగరం.. అపర్ణ ఎవరు?

వారణాసి అనే కాశీ నగరానికి సంబంధించిన వివాదాస్పద వీడియోను పోస్ట్ చేసినందుకు విమర్శలు ఎదుర్కొన్న అమెరికన్ మోడల్ అపర్ణా సింగ్ క్షమాపణలు చెప్పారు. యుఎస్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మోడల్ అపర్ణా సింగ్, భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పరిగణించబడే వారణాసిని సందర్శించారు. అక్కడున్న నగల వ్యాపారులను కలుసుకున్నారు. కాశీ మురుగునీటితో చుట్టుముట్టబడిన నది నగరం అనే శీర్షికతో టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేశారు. 
 
నగరంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను వీడియో తీసి 'కలుషితమైన గంగా నదిలో ప్రజలు స్నానాలు చేస్తున్నారు. కేఫ్‌కు వెళ్లే మార్గంలో మృతదేహాలను కాల్చివేస్తున్నారు. కేఫ్ చూడండి, అది ఎంత చెడ్డదో. నదికి చేరుకోవడానికి 40 మెట్ల వరకు నడవాలి; ధైర్యం కావాలి; భయంగా కూడా ఉంది. నడివీధిలో అక్కడక్కడ నిద్రపోతున్నారు. కుక్కలు కూడా అలానే పడుకుంటాయి’’ అన్నారు. 
 
దాదాపు 10వేల మంది అపర్ణ పోస్ట్‌పై ఖండించారు. కొందరు అపర్ణ సింగ్‌ను కలిసిన జ్యువెలర్‌ షాప్‌ యజమానిని కలిశారు. పవిత్ర నగరాన్ని అవమానించినందుకు అపర్ణా సింగ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత, అపర్ణ సింగ్ పోస్ట్ చేసిన మరో వీడియోలో, అతను పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను, కాశీ నగరాన్ని అవమానించినట్లు భావిస్తే, అందుకు క్షమాపణలు చెబుతున్నాను.. అంటూ తెలిపారు.