శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (13:17 IST)

నిత్యానందకు బ్రిటన్ ఎంపీలు పార్టీ ఇచ్చారా..?

nithyananda
భారత్‌లో వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న నిత్యానందకు బ్రిటన్ ఎంపీలు పార్టీ పెట్టారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద భారతదేశంలో వివిధ క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉంటూనే కైలాస అనే కొత్త ద్వీప దేశాన్ని సృష్టించి, దానికి నాణేలు, పాస్ పోర్టులు జారీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో నిత్యానందపై మరో వార్త సంచలనం రేపుతోంది. 
 
ఇంగ్లండ్‌లోని ఇద్దరు ఎంపీలు నిత్యానందను పార్టీకి ఆహ్వానించినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. భారత్‌లో వాంటెడ్ క్రిమినల్ కోసం ఇంగ్లండ్‌లో పార్టీ పెట్టిన వార్త వివాదాస్పదమైనప్పటికీ, సంబంధిత ఎంపీ అలాంటి పార్టీ ఏమీ జరగలేదని కొట్టిపారేశారు.
 
హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో దీపావళి పార్టీకి నిత్యానంద హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో భారతదేశం నుండి పారిపోయాడు. 
 
ఆపై అతను "రిపబ్లిక్ ఆఫ్ కైలాస"ను ఏర్పాటు చేశాడు. నిత్యానందకు భారతదేశంలో భారీగా అనుచరులు వున్నారు. డజనుకు పైగా దేవాలయాలు, ఆశ్రమాలను నడిపాడు.