గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

నేడు అంతర్జాతీయ జంతు దినోత్సవం... చరిత్ర ఎలా మొదలైందో తెలుసా?

animal welfare day
ప్రతి యేటా అక్టోబరు నాలుగో తేదీని అంతర్జాతీయ జంతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని గత 1931 నుంచి జరుపుతున్నారు. పర్యావరణ పరిరక్షకుడుగా ఖ్యాతిగడించిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అక్టోబరు 3, 1226న చనిపోగా, ఆయన చనిపోయిన మరుసటి రోజును పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగనే ప్రపంచ జంతు దినోత్సవంగా ప్రకటించి జరుపుకుంటారు. 
 
వాస్తవానికి ఈ భూమిమీద ఎన్నో రకాలైన జంతువులు మనుషులతో పాటు జీవిస్తున్నాయి. అయితే, భూమిమీద మనుషుల కంటే ముందు నుంచే జంతువులే ఉన్నాయని సైన్స్ చెబుతోంది. అయితే, భూమి ఆవిర్భవించిన తర్వాత అనేక అరుదైన జంతువుల జాడ కనిపించకుండా పోయింది. నేటి ఆధునిక యుగంలోనూ అనేక జంతువులు అంతరించిపోతున్నాయి. 
 
ఇలాంటి జంతువులు అంతరించకుండా పోకుండా వాటిని సంరక్షిడమే ఏకైక లక్ష్యంగా ప్రపంచ జంతు దినోత్సవాన్ని ప్రతి యేటా నిర్వహిస్తుంటారు. ఇదే దీని ముఖ్యోద్దేశ్యం. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను సృష్టించడం, వాటిని సంరక్షించి, వృద్ధి చేయండి, జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యంగా భావిస్తారు. 
 
ఈ జంతు దినోత్సవాన్ని తొలిసారి 1931లో తొలిసారి ఇటలీ దేశంలోని ఫ్లోరెన్స్ పట్టణంలో జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షకుడాగా పేరుగడించిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పండుగను పురస్కరించుకుని అక్టోబరు నాలుగో తేదీన జంతు దినోత్సవంగా నిర్వహించారు. 
 
అప్పటి నుంచి ప్రతి యేటా ఈ జంతు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మానవుడికి, జంతువులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ దినోత్సవం తెలియజేస్తుంది. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారాలలతో జంతు పరిరక్ష ప్రత్యేక క్యాంపులను నిర్వహించడం, జంతు సంరక్షణ కోసం నిధులను సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.