శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (09:52 IST)

ఈ రోజు సోమాతి అమావాస్య.. రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు..

lord shiva
సోమవారం నాడు వచ్చే అమావాస్యని "సోమవతి అమావాస్య" పేరుతో పిలుస్తున్నారు. సోముడు అంటే చంద్రుడు, ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుడిని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. అందుకే సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. 
 
శివుడిని అభిషేకించిన బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే.. సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని విశ్వాసం. ఈ పూజ పంచారామాల్లో కానీ, రాహు కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపించినా మంచి ఫలితం పొందుతారని అంటారు.
 
సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగి పోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాసం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగి ఆరోగ్యం, సంపద కలుగుతుంది. ఈ వ్రతం చేసే స్త్రీకి దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.