గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మే 2022 (15:52 IST)

పొత్తుల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నాం : సోము వీర్రాజు

somu veerraju
వచ్చే 2024లో జరిగే ఎన్నికల కోసం పెట్టుకునే పొత్తులపై తాము ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలతో తాము పొత్తులో ఉన్నామన్నారు. 
 
అయితే, తెలుగుదేశం పార్టీతో జనసేన కలుస్తుందో లేదో జనసేన నేతలనే అడగాలని ఆయన కోరారు. తమ పార్టీని, తమ పార్టీ నేతలను అనవసరంగా దుర్భాషలాడుతున్న కాకినాడ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆటలను సాగినివ్వబోమన్నారు. 
 
శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుడు రజాక్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. అనంతపురం జిల్లా గోరంట్లలో బీఫార్మసీ విద్యార్థిని హత్యాచారం చేసిన నిందితుడు సాధిక్‌ను పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదని ఆయన డిమాండ్ చేశారు.