మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మే 2022 (19:09 IST)

Akshaya Tritiya 2022: పసుపు వినాయకుడిని పూజిస్తే?

Vinayaka
Vinayaka
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అదృష్టం కలిసొస్తుందని విశ్వాసం. అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారు, వెండిని కొనడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ రోజు బంగారం కొనలేని వారు ఈ పూజ చేస్తే ఎనలేని ధనప్రాప్తి కలుగుతుంది. 
 
సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, పూజామందిరాన్ని శుభ్రపరిచి దేవుని పటాలకు పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపాలను కూడా పసుపు,కుంకుమ,పువ్వులతో అలంకరించుకొని దీపాలు వెలిగించుకోవాలి.
 
పూజ మందిరంలో రంగవల్లికలు వేసి దానిపై ఓ పీఠను ఉంచి దాని కింద పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకులో బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. ఈ కలశానికి నూలును చుట్టడం, మామిడి ఆకులను వుంచడం, కలశపు నీటిలో పచ్చకర్పూరం, ఒక లవంగం, ఒక యాలక్కాయను వేయాలి. 
 
తర్వాత పసుపులో వినాయకుడిని చేసి దానికి పువ్వులు, కుంకుమ పెట్టుకోవాలి. ఈ వినాయకునికి పూజలు చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
 
అటు పిమ్మట కొత్త వస్త్రాలు బంగారం గనుక ఉంటే కలశానికి ముందు పెట్టుకోవాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 
 
అక్షయ తృతీయ రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగి సత్ఫలితాలు వస్తాయి.