1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 21 జులై 2014 (17:20 IST)

వాయువ్య స్థలంలో నివసిస్తున్నారా? ఐతే ఇలా వుంటారు?

వాయువ్య స్థలంలో నివసిస్తున్నారా? ఐతే వీరికి ఆత్మశక్తి, ధీరత్వము ఎక్కువ. నిశ్చితాభిప్రాయములను కలిగివుంటారు. వీరికి ప్రతివిషయము నందు విమర్శనా శక్తి అధికము. క్రమశిక్షణతో కూడిన పనులు నెరవేర్చుతూ, అమితమైన జ్ఞాపకశక్తి కలిగివుంటారు. తమ అభిప్రాయములను తు.చ తప్పకుండా పాటిస్తారు. 
 
సంఘము నందు పేరు ప్రతిష్టలు కలుగుతాయి. పట్టుదలతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కార్యసాధనకు ప్రయత్నించు స్వభావము కలిగివుంటారు. ఇతరులకు సహాయపడే గుణముతో పాటు కష్టాల్లో వుంటే వారికి ధైర్యం చెప్పి ప్రోత్సహిస్తారు.

ధన సంపాదనకంటే గౌరవ మర్యాదలకు ప్రాధాన్యమిస్తారు. వీరికి అన్న వస్త్రాదులకు లోటు అనేది వుండదని వాస్తు నిపుణులు అంటున్నారు.