శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (14:15 IST)

చదువుకునే సమయంలో ఏ దిక్కుల్లో కూర్చోవాలి..?

వాస్తు శాస్త్రం అనేది సైన్సు యొక్క ఒక అంశం, విద్యతోపాటుగా విద్యేతర కార్యకలాపాలలో విద్యార్థులు రాణించడం ఎంతో ముఖ్యం. తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క విద్య కొరకు స్కూలింగ్, ట్యూషన్‌లమై మాత్రమే కాకుండా వాస్తుపైన కూడా దృష్టి పెట్టాలి. ఒకవేళ గది వాస్తు అనుకూలంగా లేనట్టయితే, అప్పుడు విద్యార్థులు సబ్జెక్ట్‌ల్లో సమస్యలు ఎదుర్కుంటారు. 
 
పిల్లల స్టడీరూమ్‌లో సానుకూల శక్తి ఉండాలి. ఇది వారు తమ పనులపై దృష్టి సారించడానికి దోహదపడుతుంది. విద్య కొరకు వాస్తు అనేది విద్యార్థులకు తమ విద్యాపరమైన లక్ష్యాలని అదేవిధంగా ఇతర సృజనాత్మక కార్యక్రమాల్లో తమ లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతుంది. అనేకసార్లు విద్యార్థులు కష్టపడి చదివినప్పటికీ కూడా వారికి మంచి ఫలితాలు రావు. అయితే వాస్తు పిల్లలకు సహాయపడుతుంది. వారిలోని ఏకాగ్రత స్థాయిల్ని పెంపొందిస్తుంది. 
 
చదువు కొరకు సరస్వతీ స్థానం ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసా..? మీ ఇంటిలోని సరస్వతి స్థానంలో ఏదైనా లోపాలున్నట్టయితే, అది మీ తెలివితేటలు, విద్యపై ప్రభావం చూపుతుంది. పరోక్షంగా ఇది మీ వ్యాపారాభివృద్ధి, సంపద సృష్టిపై ప్రభావం చూపుతుంది. సరళవాస్తు నిపుణులు మీ ఇంటిలోని సరస్వతి స్థానాన్ని విశ్లేషిస్తారు. తగిన చర్య తీసుకోనేందుకు సహాయపడుతారు. 
 
పిల్లవాడు చదువుకునే సమయంలో ఏ దిక్కుల్లో కూర్చోవాలి..? వాస్తు అనేది దిక్కుల శాస్త్రం, ఈ దిక్కులు వస్తువులకు మాత్రమే కాకుండా వ్యక్తులను కూడా వర్తిస్తాయి. విద్యార్థులు చదువుకునేటప్పుడు విధిగా 4వ అనుకూలమైన దిక్కులో కూర్చోవాలి. తద్వారా చదువులో ఏకాగ్రతను పొందగలరు. చదువుకునే సమయంలో మంచంపై కూర్చోకూడదు. ఇది చదువులో మీ ఏకాగ్రతను తగ్గిస్తుంది. మంచంపై కూర్చుని చదవడం వలన చదువుకోవడానికి అవసరమైన దృష్టి సారించలేరు.