మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (13:56 IST)

బీమ్‌కు దిగువన కూర్చుని పనిచేస్తారా..?

ఆరోగ్యమే మహాభాగ్యం అనే పాత సామెత దీనికి వర్తిస్తుంది. దీన్ని స్పూర్తిగా తీస్కుని ప్రజలు తమ దేహాలు, తాము తినే ఆహారం, వారు పీల్చే గాలి, వారు తీసుకునే ఆరోగ్య బీమా మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. ఇక వ్యక్తుల యొక్క శారీరక, మానసిక శక్తిని పెంపొందించడం, దేహంలోని ఏడుచక్రాలను క్రియాత్మకం చేయడంలో వాస్తు ఎంతగానో దోహదపడుతుంది. 
 
మీ ఇంట్లోని లేదా ఆఫీసులోని బాత్‌రూమ్లు, టాయిలెట్‌లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాత్‌రూమ్‌లు, టాయి‌లెట్‌లు చాలా వ్యతిరేక శక్తిని ఉద్గారిస్తాయి. అందువలన వాటిని అన్నివేళలా మూసి ఉంచడం మంచిది. 
 
మీరు బీమ్‌కు దిగువన కూర్చుని పనిచేస్తారా..? బీమ్ లేదా స్థంభం కింద కూర్చుని పని చేయవద్దు. ఇలా చేయడం వలన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బీమ్ సంపూర్ణ ఇంటి యొక్క వ్యతిరేక శక్తిని భరిస్తుంది. అలా కూర్చున్నట్టయితే వ్యతిరేక శక్తి మీపైకి బదిలీ అవుతుంది. అందువలన ఆ స్థానంలో శాశ్వతంగా కూర్చోవడాన్ని మానుకోవాలి. 
 
మీ ఇంటిలో ఉపయోగించని ఔషధాలున్నాయా.. అయితే వాటిని వెంటనే తొలగించాలి. సరళవాస్తు ప్రకారం, ఉపయోగించని ఔషధాలను మీ ఇంట్లో ఉంచడం వలన అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే.. మీ గత అస్వస్థత యొక్క వ్యతిరేక, మానసిక స్థితికి ప్రాతినిధ్యం వహిస్తాయి.