బేబీకార్న్‌తో కుర్మా ట్రై చేయండి.. చపాతీలకు భలే కాంబినేషన్
జీర్ణక్రియను మెరుగుపరిచే బేబీ కార్న్ కొవ్వును నియంత్రిస్తుంది. చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి బేబీ కార్న్‌తో కుర్మా సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలకు ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
బేబీ కార్న్ - రెండు కప్పులు
నూనె - సరిపడా
ఉల్లి తరుగు - ఒక కప్పు
టమోటా తరుగు - ఒక కప్పు
పెరుగు-ఒక కప్పు,
మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు,
కొత్తిమీర-రెండు రెమ్మలు
ఉప్పు, కారం-తగినంత
చక్కెర-చిటికెడు,
పసుపు-అరచెంచా,
పచ్చిమిర్చి-మూడు
తయారీ విధానం :
ముందుగా ముక్కల్ని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కనబెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో నూనె పోసి ఉల్లి, పచ్చిమిర్చి, టమోటా తరుగు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత ఉడికించిన కార్న్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, చక్కెర వేసి మూతపెట్టాలి.
ఐదు నిమిషాల తరువాత దానిలో తగినంత నీరు చేర్చి పావు కప్పు పెరుగు చేర్చుకోవాలి. ఈలోగా మొక్కజొన్న పిండిని రెండు చెంచాల నీటితో జారుగా కలుపుకోవాలి. దీన్ని కూడా బేబీ కార్న్ ముక్కలకు పట్టించాలి. గ్రేవీలా తయారయ్యాక దించేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే.. బేబీ కార్న్ కుర్మా రెడీ.