శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 డిశెంబరు 2015 (09:02 IST)

కాలీఫ్లవర్ వెరైటీ రైస్ ఎలా చేయాలి

కాలీఫ్లవర్ పోషకాలు అధికంగా ఉన్న వెజిటేబుల్. ఇందులో విటమిన్ సి, కెలు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి రక్తప్రసరణకు సహాయపడుతాయి. కాలీఫ్లవర్ గర్భిణి స్త్రీలకు చాలా ఉపయోగకరమైనవి. ఇది గర్భస్థ శిశువు మెదడు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి కాలీఫ్లవర్‌తో వెరైటీ రైస్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్ - రెండు కప్పులు 
పచ్చిబఠానీలు - అరకప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్ 
జీలకర్ర - పావు స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - పావు స్పూన్ 
గరం మసాలా - పావు స్పూన్ 
కొత్తిమీర తరుగు - పావు స్పూన్ 
ఉప్పు, నూనె- తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా అన్నం వండిపెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో కొద్దిగా నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి అందులోనే కాలీఫ్లవర్ కూడా వేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ చల్లారిన తర్వాత నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. పాన్‌లో కొద్దిగా పాన్‌లో కొద్దిగా నూనె పోసి అందులో కాలీఫ్లవర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.