బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:04 IST)

టేస్టీ సొరకాయ పొట్టు చట్నీ ఎలా చేయాలంటే...

సాధారణంగా మనం రకరకాల కూరగాయలు తింటూ ఉంటాం. వాటిలో నీటిశాతం ఎక్కువుగా ఉన్న కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా టమోటా, దోసకాయ, బీరకాయ, సొరకాయలో నీటిశాతం ఎక్కువుగా ఉంటుంది. సొరకాయలో చాలా రకాల ఔషధగుణాలు ఉన్నాయి. సొరకాయతో రకరకాల పచ్చళ్లు, కూరలు, హల్వా వంటకాలను తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు సొరకాయ పొట్టు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు..
సొరకాయ పొట్టు- అరకప్పు,
శనగపప్పు- అర టేబుల్ స్పూన్,
మినపప్పు- ఒక టేబుల్ స్పూన్,
ఎండుమిర్చి-4,
తరిగిన ఉల్లిపాయ-1,
టమోటా-1,
వెల్లుల్లి రెబ్బలు-4,
కరివేపాకు- 4 రెబ్బలు,
కొత్తిమీర- కొద్దిగా,
చింతపండు పులుసు- పావు కప్పు,
నూనె- ఒక టేబుల్ స్పూన్,
ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం....
ఒక బాణలిలో నూనె పోసి శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఎండుమిర్చి, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేయించాలి. సొరకాయ పొట్టు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి 5 నిమిషాలు వేయించాలి. తరువాత చింతపండు పులుసు, పసుపు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని పోపు పెట్టుకోవాలి. ఎంతో రుచిగా ఉండే సొరకాయ పొట్టు చట్నీ రెడీ.