హెల్తీ స్నాక్.. మష్రూమ్ టోస్ట్ ఎలా చేయాలంటే..?
మష్రూమ్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..? మష్రూమ్‌ను వారానికి ఓసారి ఆహారంలో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ లెవల్స్ క్రమబద్ధీకరింపబడుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, డయాబెటిస్, ఒబిసిటీని దూరం చేస్తాయి. బరువును తగ్గించడంలో మష్రూమ్స్ సూపర్‌గా పనిచేస్తారు. ఇంకా శరీరానికి బలం చేకూర్చి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అలాంటి మష్రూమ్స్‌తో స్నాక్స్ రిసిపీ మష్రూమ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
వీట్ బ్రెడ్ - ఆరు ముక్కలు
చీజ్ - అర కప్పు
మష్రూమ్స్ ముక్కలు - ఒక కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
క్యాప్సికమ్ - అర కప్పు
టమోటా తరుగు - అర కప్పు
నూనె, ఉప్పు - తగినంత
తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి పాన్‌ను స్టౌ మీద పెట్టి పాన్ వేడయ్యాక అందులో బ్రెడ్ ముక్కలను ఇరువైపులా దోరగా వేయించుకుని పక్కనబెట్టుకోవాలి. తర్వాత మరో బాణలిని స్టౌ మీద పెట్టి వేడయ్యాక నూనె పోసి, అందులో ఉల్లి, టమోటా, క్యాప్సికమ్, మష్రూమ్స్ చేర్చి ఐదు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉప్పు చేర్చుకోవాలి.
ఈ మిశ్రమాన్ని టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలపై ఉంచి.. దానిపై చీజ్ తురుమును చేర్చి ఓవెన్‌లో 2-3 నిమిషాల పాటు (చీజ్ కరిగేదాక) ఉంచి సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. అంతే మష్రూమ్ టోస్ట్ రెడీ అయినట్లే. ఈ టోస్ట్‌ను టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.