మంగళవారం, 13 జనవరి 2026
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By PNR
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (17:32 IST)

మైసూర్ బోండా తయారీ ఎలా?

కావలసిన పదార్థాలు : 
 
మైదా పిండి - రెండు కప్పులు,
 బియ్యపు పిండి - రెండు కప్పులు, 
పచ్చిమిర్చి - ఐదు, 
జీలకర్ర - రెండు చెంచాలు, 
నూనె - రెండు కప్పులు, 
వంటసోడా - చిటికెడు, 
ఉప్పు - తగినంత,
పుల్ల మజ్జిగ - రెండు కప్పులు
 
తయారు చేయు విధానం :
ముందుగా పుల్ల మజ్జిగలో మైదా పిండి, బియ్యపు పిండిలను వేసి కలపాలి. ఇందులోనే ఉప్పు, వంటసోడాలను వేసి కలిపి నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టండి. పచ్చిమిర్చి, జీలకర్రలను పొడి చేసి నానపెట్టిన పిండిలో వేసి కలపండి. బాణాలిలో నూనె వేసి కాగాక అందులో పిండిని బోండాల్లాగా వేసి గోధుమ రంగు వన్నె వచ్చేంతవరకు వేయించి దించి సర్వ్ చేయండి.