వెజిటబుల్ శాండ్‌విచ్ తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దాం!
నోరువూరించే వెజిటబుల్ శాండ్‌విచ్ తయారు చేయటానికి 15 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. వెజిటబుల్ శాండ్‌విచ్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!
కావలసిన పదార్థాలు:
బ్రౌన్ బ్రెడ్ స్లైస్‌లు- ఆరు.
బంకాళదుంపలు- రెండు (ఉడకబెట్టి పొట్టు తీయాలి).
కీరా- ఒకటి
టొమాటో- రెండు
ఉల్లిపాయ- ఒకటి
క్యాప్సికమ్- ఒకటి
మిరియాలపొడి- టీ స్పూన్
చాట్ మసాలా- టీ స్పూన్
తయారు చేసే విధానం.
కూరగాయలని గుండ్రంగా కట్ చేసుకోవాలి, బ్రెడ్ చుట్టూ ఉండే అంచులను తీసేయాలి, బ్రెడ్‌పై ముందుగా బంగాళదుంప ముక్కని చేర్చి, తరువాత టొమాటో, కీరా, క్యాప్సికమ్ ముక్కలని వరుసగా ఒకదాని తరువాత ఒకటి పేర్చిన తరువాత చివరగా చీజ్ రాయాలి. మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి, మరో బ్రెడ్ స్లైస్‌తో కవర్ చేయాలి. తరువాత పెనం వేడి అయ్యాక, బ్రెడ్ స్లైస్‌లను గోధుమరంగు వచ్చే వరకు టోస్ట్ చేసి తీయాలి. ఇలా మిగతా బ్రెడ్ స్లైస్‌లతో చేసి టొమాటో కెచప్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది. చితోపాటు కూరగాయల్లో ఉండే పోషకాల వల్ల ఆరోగ్యం కూడ ఎంతో పొందవచ్చును.